సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో నాగార్జున ఒకరు.ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ వచ్చాడు.
ఇక అందులో భాగంగానే మొదటగా నాగార్జున లవర్ బాయ్ క్యారెక్టర్లు చేస్తూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.ఇంకా ఎప్పుడైతే శివ సినిమా( Siva ) వచ్చిందో అప్పటినుంచి మాస్ సినిమాలను కూడా ఎక్కువగా చేస్తూ తనదైన మార్కు చాటుతూ ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

స్వతహాగా నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) కొడుకుగా నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో మొదట్లో నాగార్జున నటన పట్ల చాలా విమర్శలు ఎదుర్కున్నాడు.అయినప్పటికీ అందరికీ తన నటనతో తన స్టార్ డాం తో సమాధానం చెబుతూ వచ్చాడు…ఇక ఇదిలా ఉంటే శతమానం భవతి సినిమా డైరెక్టర్ అయిన సతీష్ వేగేశ్న ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొన్ని సినిమాలకి రైటర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అందులో భాగంగానే ఆయనకి నాగార్జునతో పరిచయం ఏర్పడింది.

దాంతో నాగార్జున ఆయనతో ఒక సినిమా చేస్తాను అని స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పాడంట దాంతో ఆయన కష్టపడి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని నాగార్జునకి ( Nagarjuna _వినిపించినప్పటికీ ఆ స్టోరీ కూడా నాగార్జున కి బాగా నచ్చింది కానీ ఆ సినిమా చేయాలా వద్దా అని డైలామా లో ఉంటూ సతీష్ వేగేశ్న కి ఏమి చెప్పకుండా ఆ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టి అలా కొద్ది రోజులు సతీష్ ను తన చుట్టూ తిప్పుకున్నాడు.ఇక ఆ టైం లో బిందాస్ సినిమాతో మంచి హిట్ కొట్టిన వీరు పోట్ల చెప్పిన స్టోరీ చెప్పడంతో రగడ సినిమా చేయడానికి నాగార్జున మొగ్గు చూపి సతీష్ వేగేశ్న సినిమాని వదులుకున్నాడు.ఇక దాంతో అప్పటికే నాగార్జున చుట్టూ తిరిగి సంవత్సర కాలం వేస్ట్ చేసుకున్న సతీష్ డైరెక్టర్ హరిష్ శంకర్ సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు.
ఇక ఆ తర్వాత ఆయన దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ ని హీరోగా పెట్టు శతమానం భవతి అనే సినిమా తీశాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
దాంతో పాటుగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అయితే నాగార్జున చేతిలో బలి అయిన డైరెక్టర్లలో సతీష్ వేగేశ్న ఒకరు…
.







