పెళ్లిచూపులు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైనటువంటి తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో ఈయన దర్శకుడిగా కంటే నటుడిగానే బాగా బిజీ అయ్యారని తెలుస్తుంది.
ఇక చాలా రోజుల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కీడాకోలా ( Keedaakola ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ సినిమా ద్వారా తరుణ్ భాస్కర్ ప్రేక్షకులను ఎలా మెప్పించారు అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…
కథ:
కార్పోటర్ కావటానికి అర్జెంట్ గా జీవన్ ( జీవన్ కుమార్) కు కోటి రూపాయలు కావాలి.ఆ విషయం తన భక్త అన్న నాయుడు (తరుణ్ భాస్కర్) ని అడుగుతారు అయితే తరుణ్ భాస్కర్ 20 సంవత్సరాలు పాటు జైలులో ఉండి అప్పుడే బయటకు వస్తారు ఇక తనకు కోటి రూపాయలు కావాలి అంటే ఒక భారీ స్కెచ్ వేస్తారు.కీడా కోలాలో బొద్దింక వేసి,అది చూపెట్టి కంపెనీ వాళ్లపై కేసు వేద్దాం అనుకుంటాడు.
ప్లాన్ సజావుగా సాగుతుంది అనకుంటే ఆ కీడా కోలా .డబ్బు విపరీతమైన అవసరం ఉన్న వాస్తు (చైతన్య రావు) చేతికి వస్తుంది. చిన్నప్పుడే వాస్తు తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాతయ్య దగ్గర పెరుగుతారు.అయితే ఒక బార్బీ బొమ్మ విషయంలో ఈయన కోటి రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి రావడంతో ఆ కీడాకోల కూల్ డ్రింక్ చేతికి వస్తుంది.
అంతే దాన్ని అడ్డం పెట్టి కంపెనీ నుంచి డబ్బులాగాలనుకుంటాడు.తన ప్రెండ్ లాయిర్ లాంచమ్ (రాగ్ మయూర్) సలహాతో ముందుకు వెళ్తాడు.అయితే వీళ్లదగ్గర ఈ బాటిల్ ఉందన్న విషయం తెలిసిన జీవన్,నాయుడు వాళ్లను కిడ్నాప్ చేసి టార్చర్ మొదలెడతారు.మరి చివరికి కంపెనీ నుంచి వారు డబ్బు రాబట్టారా? ఇక వాస్తు కేసు విషయంలో కోటి రూపాయలు ఎలా చెల్లించారు అనే విషయం గురించి ఈ సినిమా సాగుతుంది.
నటీనటుల నటన:
తరుణ్ భాస్కర్ డైరెక్టర్ కంటే నటుడి గానే తన నటన విశ్వరూపం చూపించారు.ఇక కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఎప్పటిలాగే తన కామెడీ ద్వారా అందరిని నవ్వించారు.వాస్తు పాత్రలో చైతన్య రావు బాగా చేసారు.’రోడీస్’ షో ఫేమ్ రఘురామ్ ఫెరఫెక్ట్.లాయిర్ గా రాగ్ మయూర్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు.ఇతర తారాగణం మొత్తం వారి పాత్రలకు తగ్గట్టు నటించారనే చెప్పాలి.
టెక్నికల్
: తరుణ్ భాస్కర్ ఈ జనరేషన్ యూత్ కు తగ్గ సినిమాలు చేయటంలో పండిపోయారు.ఇక ఈ సినిమాని ప్రేక్షకులకు అనుగుణంగా దర్శకుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.డైరక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సూపర్బ్ అనిపిస్తాయి.గట్టిగానే ఖర్చుపెట్టారు.వివేక్ సాగర్ ( Vivek Sagar )సంగీతం బాగుంది కానీ మిగతా డిపార్టమెంట్స్ తో పోటి పడలేదు.ఇక ఈ సినిమా రన్ టైం రెండు గంటలు మాత్రమే ఉండడంతో ఎక్కడ బోర్ లేకుండా అందరిని ఎంటర్టైన్ చేసింది.
విశ్లేషణ:
లోకల్ పాత్రలను ఎంచుకుని వాటిని ఇంటర్నేషనల్ సినిమా స్దాయి స్క్రీన్ ప్లేలో చూపించారు .ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు కానీ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం చెప్పడం కష్టమే అనిపించేలా సినిమా ఉంది.ఇక ఈ సినిమాలోని క్యారెక్టర్లతో మనం కనుక కనెక్ట్ కాకపోతే ఈ సినిమా కాస్త సౌండ్ పొల్యూషన్ అని అనిపిస్తుంది.ఫస్టాఫ్ కథా నేపధ్యం, పాత్రల పరిచయానికి సరిపోయింది సెకండ్ హాఫ్ కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్
: తరుణ్ భాస్కర్ నటన, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, అక్కడక్కడ వచ్చే కొన్ని ఇంగ్లీష్ కామెడీ సీన్స్.
మైనస్ పాయింట్స్:
బ్రహ్మానందం పాత్ర, ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్.రోటీన్ డైలాగ్స్.
బాటమ్ లైన్:
సినిమా చూస్తున్నంత సేపు పరవాలేదు అనిపించిన ఈ తరహా కథలు ఇదివరకే రావడంతో సినిమాలో కొత్తదనం ఏమి కనిపించలేదు.