కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.విజయ్ కెరీర్ పరంగా ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నాడనే చెప్పాలి.
ఈ ఏడాది వారిసు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని అదే జోష్ లో మరో సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా విజయ్ ఆయన తల్లితో (Thalapathy Vijay Mother) దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
విజయ్ తల్లిదండ్రులు ఎస్ ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ (Shoba Chandrasekhar) ల 50 వ పెళ్లి రోజు కావడంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు.విజయ్ తల్లిదండ్రులతో సమయాన్ని స్పీడ్ చేసారు.
ఆ తర్వాత తన తల్లితో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.విజయ్ ఆయన తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని దిగిన ఫోటో ఫ్యాన్స్ కు బాగా నచ్చడంతో తెగ షేర్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.లియో అనే టైటిల్ తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా పాన్ ఇండియా బరిలో ఉంది.ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం కంటే ఎక్కువనే పూర్తి అయినట్టు తెలుస్తుంది.
వీరి కాంబోలో రాబోతున్నట్టు రెండవ సినిమా అందులోను లోకేష్ (Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాపై తమిళ్ లో ఇప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష (Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.లోకనాయకుడు కమల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy