అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ( Naga Chaitanya) లేటెస్ట్ గా నటించిన మూవీ కస్టడి (Custody).
కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయిన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా అయితే పెద్దగా రాణించడం లేదు.దీంతో మరోసారి అక్కినేని హీరోకు ప్లాప్ ఎదురయ్యింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కిన విషయం విదితమే.తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ బైలింగ్వన్ మూవీను శ్రీనివాస చిట్టూరి నిర్మించగా.ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు.
కస్టడీ కలెక్షన్స్ ఎలా ఉన్న ఈ తమిళ్ డైరెక్టర్ అందరిలో గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.మరి ఈ సినిమా తర్వాత ఈయన నెక్స్ట్ ఏంటి అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
కాగా తాజాగా అందుతున్న క్రేజీ బజ్ ప్రకారం ఈయన తన నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోతో చేయబోతున్నట్టు టాక్.మరి ఆ స్టార్ ఎవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ( Thalapathy Vijay ).
ఈయనతో సినిమా ఓకే చేసేందుకు సన్నాహాలు కూడా జరుగు తున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారు ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ కాంబోలో వచ్చే సినిమాను నిర్మించనున్నట్టు టాక్.విజయ్ కెరీర్ లో ఈ సినిమా 68వ సినిమాగా తెరకెక్కనుంది.మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ప్రజెంట్ అయితే విజయ్ తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.లియో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy