ఇంటి అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడ ఉన్నవాటిని చూసి ఇల్లు వదిలి పారిపోయాడు అక్కడ ఏమి ఉన్నాయో తెలుసా

ఇంట్లో ఒక్క పాము చూస్తేనే వెన్నులో ఒణుకు పుడుతుంది.అలాంటిది ఇంట్లోనే తెలియకుండా 45 పాములు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.

 Texas Homeowner Finds 45 Rattlesnakes Underneath His Home-TeluguStop.com

ఇంట్లో ఒకే చోట 45 పాములు చూసిన ఆ వ్యక్తి ఉచ్చ పోసుకోవడం ఖాయం.తన ఇంట్లో ఎంతో హాయిగా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్న వ్యక్తికి అనుకోకుండా ఒకసారి తన ఇంటి అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లడం జరిగింది.

అక్కడకు తరచు వెళ్లని కారణంగా ఏకంగా 45 పాములు తిష్ట వేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికా టెక్సాస్‌లోని ఆల్బనీ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి తన ఇంట్లో కేబుల్‌ రావడం లేదని, కలెక్షన్‌ ఉన్న అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లి చూడాలని చిన్న లైట్‌ పట్టుకుని వెళ్లాడు.

అతడు అక్కడకు వెళ్లిన వెంటనే ఏదో వింతైన శబ్దాలు విన్నాడు.దాంతో అతడు కాస్త జాగ్రత్త పడ్డాడు.స్పీడ్‌గా లోనికి వెళ్లకుండా మెల్లగా అడుగులు వేశాడు.మూడు అడుగులు వేసిన తర్వాత లైట్‌ వెలుతురుకు ఒక పాము కనిపించింది.

దాంతో వెంటనే అతడు ఒక పెద్ద లైట్‌తో అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లాడు.అప్పుడే అతడికి పదుల సంఖ్యలో పాములు కనిపించాయి.

వెంటనే పాములను పట్టే వారికి ఫోన్‌ చేశాడు.పాములను పట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఒక్కొక్కటి చొప్పున పాములన్ని పట్టేశారు.అక్కడ పది కాదు, ఇరవై కాదు ఏకంగా 45 పాములు ఉన్నాయి.ఆ పాములను చూసి ఇంటి యజమాని మరియు ఆయన కుటుంబ సభ్యులు పారిపోయారు.ఇంట్లో పాములు అన్ని కూడా పోయే వరకు మళ్లీ ఇంట్లో అడుగు పెట్టం బాబోయ్‌ అంటున్నారు.పాములను పట్టే వారు మొత్తం పాములను తొలగించాం అని చెప్పిన తర్వాత వారు ఇంట్లోకి అడుగు పెట్టారు.

ఇంట్లో కూడా అనువణువు గాలించి ఎక్కడైనా పాములు ఉన్నాయా అనే విషయాన్ని చూశారు.పెద్ద ఎత్తున పాములను చూసి కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగింది.

ఆ ఇంటినే వదిలేయాలనే భయం మొదలైంది.ఇంటి అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడ ఉన్నవాటిని ఇల్లు వదిలి పారిపోయాడు అక్కడ ఉన్నవి ఏంటో తెలుసా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube