టెక్సాస్‌ : చరిత్రలో నిలిచిపోయేలా దీపావళి వేడుకలు .. తొలిసారిగా బాణాసంచాకు అనుమతి

దివ్వెల పండుగ దీపావళిని( Diwali ) భారత్ సహా పలు దేశాలలో ఘనంగా జరుపుకున్నారు.

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన అమెరికాలో( America ) దివాళీ ఘనంగా జరిగింది.

న్యూయార్క్ నగరంలో ఈ ఏడాది నుంచి స్కూళ్లకు సెలవు ప్రకటించారు.వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) హాజరయ్యారు.దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ .అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీగా దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

కమలా హారిస్( Kamala Harris ) నుంచి డాక్టర్ వివేక్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బైడెన్ పేర్కొన్నారు.

టెక్సాస్ రాష్ట్రం( Texas State ) అధికారికంగా గుర్తించడం హ్యూస్టన్, హారిస్ కౌంటీ, హ్యూస్టి సిటీ హాల్‌లో బాణాసంచా కాల్చుకోవడానికి తొలిసారిగా అనుమతి రావడంతో ఈ ఏడాది అక్కడి దీపావళి వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి.కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్( CGI DC Manjunath ) ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు ఆకట్టుకున్నాయి.ఆస్టిన్‌లోని గవర్నర్ మాన్షన్‌లో దీపావళిని జరుపుకునే సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్( Texas Governor Greg Abbott ) స్వయంగా జ్యోతి వెలిగించి వేడుకల్లో పాల్గొన్నారు.టెక్సాస్ - ఇండో అమెరికన్ కమ్యూనిటీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కాన్సుల్ జనరల్ మంజునాథ్ చేస్తున్న కృషికి గవర్నర్ అబాట్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక అక్టోబర్ 31 మధ్యాహ్నం హ్యూస్టన్ సిటీ హాల్‌లో మేయర్ కార్యాలయం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు జరిగాయి.మేయర్ జాన్ విట్‌మైర్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ అతిథులకు స్వాగతం పలికారు.

రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!
ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?

భారతీయులు గొప్పగా భావించే భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక విలువలను పాటించినందుకు గాను హ్యూస్టన్ ప్రజలకు , మేయర్ విట్‌మైర్‌కు కాన్సుల్ జనరల్ మంజునాథ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు