బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. ?

ఇండోనేషియాలో ఈ మధ్య కాలంలో జరిగిన విమాన ప్రమాద ఘటన జనం మరచిపోక ముందే మరో ఘోర ప్రమాదం బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో సంభవించిన ఈ విమాన ప్రమాదంలో పామాస్ ఫుట్‌బాల్ క్లబ్‌ అధ్యక్షుడితో పాటు, పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారట.

 Brazil, Terrible, Plane Crash, Football Players-TeluguStop.com

విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలో కుదుపులకు లోనై నేలకూలడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

కాగా ఈ ప్రమాద ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడకపోవడం విచారకరం.

ఇకపోతే విలానోవా జట్టుతో ఆట ఆడేందుకు పుట్‌బాల్ ఆటగాళ్లంతా జోయియానియా కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారంత మృతి చెందారట.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదట.

ఇక మృతి చెందిన వారిలో అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారట.వీరితో పాటుగా మరో ఆరుగురు ప్రయాణికులతో పాటుగా విమాన సిబ్బంది కూడా మరణించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube