బి.జె.
పి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.అమలాపురం వెళ్తున్నారన్న సమాచారంతో జొన్నాడ జంక్షన్ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ కారణంగా కోనసీమలో పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు.అయితే తన కారు ముందుకు వెళ్లకుండా పోలీసులు లారీ అడ్డుపెట్టడంతో సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాగ్వివాదానికి దిగి పోలీసులను నెట్టివేశారు.అనంతరం రావులపాలెంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.పోలీస్ ఆంక్షల మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారనీ అన్నారు.అంబేద్కర్ పేరు పెడితే భారతదేశంలో ఎక్కడా గొడవలు రాలేదనీ.
కోనసీమలోనే ఎందుకు గొడవలు జరిగాయో దర్యాప్తు చెయ్యాలనివ్యాఖ్యానించారు.అనంతరం రావులపాలెం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు
.