చంద్రబాబు పర్యటనలో మరోసారి ఉద్రిక్తత

టీడీపీ చంద్రబాబు పర్యటనలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.గుడివాడ నుంచి నూజివీడు చంద్రబాబు బయలుదేరారు.

గుడివాడ నుంచి గన్నవరం హనుమాన్ జంక్షన్ కు వెళ్తున్నారు చంద్రబాబు.ఈ క్రమంలో ఆరుగోలను దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.

చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలుకుతుండగా గొడవ చోటు చేసుకుంది.రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సాయంత్రం నూజివీడులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు