పంజాబ్ – హర్యానా సరిహద్దు( Punjab- Haryana )తో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఛలో ఢిల్లీ( Chalo Delhi )కి పిలుపునిచ్చిన రైతులు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ క్రమంలో శంభు వద్ద రైతులను భద్రతాబలగాలు అడ్డుకున్నాయి.తరువాత రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
వందలాదిగా తరలివస్తున్న రైతన్నలను సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు పోలీసులు.దీంతో ఏ బోర్డర్ చూసిన హై టెన్షన్ వాతావరణం కన్పిస్తోంది.
అలాగే పలు రహదారులపై ముళ్ల కంచెలు, బారికేడ్లతో పాటు కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేశారు.అయితే తమ డిమాండ్ల సాధన కోసం రైతులు( Farmers Protest ) చలో ఢిల్లీ పేరుతో ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో చర్చలకు సిద్ధమని కేంద్రమంత్రులు చెబుతున్నారు.