తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..!

తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం( Tirupati Sub Collector Office ) దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు కార్యాలయం వద్దకు ఒకే సమయానికి చేరుకున్నారు.

వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,( Chevireddy Mohith Reddy ) టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని( Pulivarthi Nani ) వచ్చారు.వీరితో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఆఫీస్ ఆవరణలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, టీడీపీ క్యాడర్( TDP Cadre ) మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారని తెలుస్తోంది.మరోవైపు నామినేషన్ పత్రాలు సమర్పించి బయటకు వచ్చిన వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనంలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Advertisement

దీంతో సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు