హైదరాబాద్ గొల్లపల్లి టోల్ గేట్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గొల్లపల్లి టోల్ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టోల్ గేట్ వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు బాటసింగారం వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.అనంతరం కిషన్ రెడ్డి, రఘునందన్ రావులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు