అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాడిపత్రిలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే పెద్దారెడ్డి తొలగించారు.
సొంత ట్రాక్టర్లతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో చెత్తను తొలగిస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్థానిక మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.అయితే గత కొన్ని రోజులగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.







