యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా రెడ్డి భర్త మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న సమయంలో వారికి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చెలరేగిన వివాదంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు కొలనుపాక గ్రామానికి భారీగా చేరుకున్నారు.