కాంగ్రెస్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత.. !

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశతో కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన జనం కమళానికి పట్టం కట్టారు.

అందులో మోడీ ప్రజల కష్టాలు ఎరిగిన మనిషి అంటూ గుడ్దిగా నమ్మేశారట.

మొదటి సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రజలకు వాతలు పెట్టినా అంతగా నొప్పి తెలియలేదు.అప్పటికీ కూడా మోడీ జపాన్నే చేశారు.

Tension In Congress Protest Rally In Jagityal, Jagityal, Congress, MLC Jeevan R

కానీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం అంటూ కమళం అందరి చెవిలో పువ్వులు పెడుతుందని గ్రహించే సరికి గ్యాస్, పెట్రోల్, వంట నూనెలు వంటి నిత్యావసరాల ధరలు చంద్రమండలంలోకి చేరాయి.ఈ అంశం పై ఇప్పటికి నోరెత్తిన నాయకుడు లేడు.

ఈ నేపధ్యంలో అధికారం కోసం తపిస్తున్న కాంగ్రెస్ నేతలు పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు.అయితే ఈ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుందట.

Advertisement

కాగా జగిత్యాలలో ఈరోజు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సహా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులు జీవన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుండగా క్రింద పడిపోయాడట.దీంతో ఒక్క సారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అయినా వెనకడుగు వేయని పోలీసులు జీవన్ రెడ్డితో పాటుగా కార్యకర్తలను బలవంతగా పోలీసు స్టేషన్‌కు తరలించారట.

Advertisement

తాజా వార్తలు