Madhusudan Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( MLA Goodem Mahipal Reddy )సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ( Madhusudan Reddy )పోలీసులు అరెస్ట్ చేశారు.

పటాన్ చెరు మండలంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు వస్తున్నాయి.నాలుగు ఎకరాల్లో నిర్వహించాల్సిన మైనింగ్ సుమారు 15 ఎకరాల వరకు అధికారులు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు క్రషర్ నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయనను పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.

తరువాత మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డారు.

Advertisement

దీంతో పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు