జమ్ము- శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అమృతసర్ నుంచి కట్రా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందగా 20 మందికి పైగా గాయాలు అయ్యాయి.బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డబ్భై మంది ఉన్నట్లు తెలుస్తోంది.







