శివపార్వతులు ఎత్తిన దశావతారాలు ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చాడు అనే విషయం మనం తెలుసుకున్నాము.

లోక కల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన మిచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు.అయితే శివపార్వతులు కూడా పది అవతారాలు ఎత్తారో ననే సంగతి మీకు తెలుసా? లోక కల్యాణార్థం శివపార్వతుల కూడా పది అవతారాలు ఇతర అని పురాణాలు చెబుతున్నాయి.మరి ఆ పది అవతారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మొదటి అవతారం:

శివపార్వతులు ఎత్తిన మొదటి అవతారం మహాకాలుడు, మహాకాళి అవతారమెత్తి భక్తులకు ముక్తినిచ్చే దైవాలుగా ప్రసిద్ధి చెందారు.

రెండవ అవతారం:

శివుడి రెండవ అవతారం తారకావతారము ఈయన అర్ధాంగి తారక దేవి అవతారంలో సకల శుభాలను భక్తులకు ప్రసాదించారు.

మూడవ అవతారం:

శివుడి మూడవ అవతారం బాలభువనేశ్వరావతారము ఈయన అర్ధాంగి బాలభువనేశ్వరీ దేవి అవతారంలో సత్పురుషులకు సుఖాలను ప్రసాదించారు.

నాలుగవ అవతారం:

పరమశివుడు నాలుగవ అవతారంగా షోడశ విశ్వేశ్వరుడు ఈయన అర్ధాంగి షోడశ విద్యేశ్వరిగా భక్తులకు దర్శనం కల్పించారు.

ఐదవ అవతారం:

ఐదవ అవతారంగా పరమేశ్వరుడు భైరవ అవతారము ఎత్తగా పార్వతి దేవి భైరవి దేవిగా ఉపాసనాపరులకు కోరికలన్ని తీర్చారు.

ఆరవ అవతారం:

పార్వతీ పరమేశ్వరులు ఆరవ అవతారంగా భిన్నమస్త అవతారం ఎత్తగా పార్వతీదేవి భిన్నమస్తకి దేవిగా అవతరించారు.

ఏడవ అవతారం:

పరమేశ్వరుడు ఏడవ అవతారం ధూమ వంతుడు అవతారం కాగా పార్వతీ దేవి ధూమవతిగా అవతరించింది.

ఎనిమిదవ అవతారం:

పరమేశ్వరుడు ఎనిమిదవ అవతారంగా బగళాముఖుడు కాగా పార్వతీదేవి బగళాముఖిగా అవతరించింది పార్వతీదేవి ఎనిమిదవ అవతారానికి మరో పేరు బహానంద

Advertisement

తొమ్మిదవ అవతారం:

పార్వతీ పరమేశ్వరులు 9వ అవతారంగా మాతంగుడు — మాతంగిగా అవతరించారు

పదవ అవతారం:

పార్వతీపరమేశ్వరులు జంటగా పదవ అవతారంగా కమలుడు — కమల అనే అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు.చాలా మందికి కేవలం విష్ణుమూర్తి మాత్రమే దశావతారాలు ఎత్తడని తెలుసు కానీ, పార్వతీ పరమేశ్వరులు కూడా లోక కల్యాణార్థం పది అవతారాలు ఎత్తిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు