ఖమ్మంలో 10 హాస్పిటల్స్ కు కొవిడ్ అనుమతులు రద్దు.. నిబంధనలు అతిక్రమించడం వల్లే..!

ఖమ్మంలో కొవిడ్ వైద్య సేవలను అందిస్తున్న 10 హాస్పిటల్స్ కు అనుమతులను రద్దు చేశారు డి.ఎం.

హెచ్.ఓ డాక్టర్ మాలతి.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ హాస్పిటల్స్ కొవిడ్ వైద్య సేవలను రద్దు చేశారు.ఖమ్మం లో టాస్క్ ఫోర్స్ జరిగిన విచారణలో ఆయా హాస్పిటల్స్ కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలను అందిస్తున్నట్టు గురించారు.

దీఇతో రంగంలోకి దిగిన డి.ఎం.హెచ్.ఓ మాలతి సంబందిచిన హాస్పిటల్స్ యొక్క కొవిడ్ వైద్య సేవల అనుమతులను వెంటనే రద్దు చేశారు.

Advertisement

ఖమ్మం పట్టణంలో విశ్వాస్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, క్యూర్, మార్వెల్ జనని, ప్రశాంతి, సల్కప్ సి స్టార్, న్యూ హోప్, శ్రీ బాలాజి చెస్ట్ హాస్పిటల్, విజయలక్ష్మి హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్స్ కొవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేశారు.కొవిడ్ ట్రీట్ మెంట్ ను ప్రభుత్వం సూచించిన ఫీజులతోనే చేయాలని హెచ్చరించింది.

అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫీజులను వసూలు చేస్తున్నారు.అలాంటి హాస్పిటల్స్ పై కొరడా ఝులిపిస్తున్నారు.ఖమ్మంలో 10 ప్రైవేట్ హాస్పిటల్స్ కొవిడ్ నిబంధనలను పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తుండటంతో ఆ హాస్పిటల్స్ ను కొవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు