టాప్ 10 సీరియ‌ల్ న‌టీమ‌ణులు ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూన‌రేష‌న్

దేశ వ్యాప్తంగా బుల్లితెరకు ఎంతో డిమాండ్ ఉంది.వాటిలో సీరియల్స్ కు చెప్పలేనంత వ్యువర్ షిప్ వుంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే. సీరియల్స్ కు సినిమాలకు మించిన మార్కెట్ ఉంది.

చిన్న కథను లాగితే రోజుల కొద్దీ సీరియల్ సాగిపోద్ది అంతే! స్క్రీన్ ప్లే తెలిస్తే చాలు నెలల కొద్ది ఎపిసోడ్స్ తీసి పడేయొచ్చు! అది కూడా తక్కువ ఖర్చుతో.అంతే కాదు.

సీరియల్స్ లో నటించే నటులకూ సినిమా తారలకు మించి పాలోయింగ్ వుంది.రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది.

Advertisement
Telugu Serial Heroines Remuneration For One Day, Premi Vishwanath, Suhasini, Nav

సినిమా నటులకు ఒక్కో సినిమాకు కాల్ షీట్ ఉంటే.సీరియల్ నటులకు మాత్రం వన్ డే కాల్ షీట్ వుంటుంది.పారితోషికం కూడా రోజు వారిగానే ఇస్తారు.ఇంతకీ తెలుగు సీరియల్ నటీమణుల్లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది? రోజుకు ఎంత తీసుకుంటారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం!

ప్రేమి విశ్వనాథ్:-

Telugu Serial Heroines Remuneration For One Day, Premi Vishwanath, Suhasini, Nav

ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీరియల్స్ లో బాగా పాపులర్ అయ్యింది కార్తీకదీపం.ప్రజల్లో వంటల అక్కగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమి విశ్వనాథ్.ఇందులో దీప క్యారెక్టర్ చేస్తున్న ఈమె రెమ్యునరేషన్ రోజుకు రూ.25 వేలు.అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె ఒకరు.

సుహాసిని:-

Telugu Serial Heroines Remuneration For One Day, Premi Vishwanath, Suhasini, Nav

తొలుత ఈమె సినిమాల్లో నటించింది.పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది.ఆ తర్వాత సీరియల్స్ లోకి వెళ్ళింది.

అపరంజి సీరియల్ తో మంచి గుర్తింపు పొందింది.ఈమె రోజుకు రూ.20 వేలు తీసుకుంటుంది.

నవ్య స్వామి:-

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

నా పేరు మీనాక్షి సీరియల్ తో తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలు పెట్టింది నవ్య.ప్రస్తుతం ఆమె కథలో నటిస్తుంది.ఈమె ప్రతి రోజు రూ.20 వేల పారితోషకం తీసుకుంటుంది.

ఐశ్వర్య:-

Advertisement

ప్రస్తుతం ఈమె అగ్ని సాక్షి సీరియల్ లో మెయిన్ రోల్ పోషిస్తుంది.ఈమె కూడా రోజుకు రూ.20 వేలు తీసుకుంటుంది.

పల్లవి రామిశెట్టి:-

ఈమె ఆడదే ఆధారం సీరియల్ తో మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది.ఈమె రోజుకు రూ.15 వేల పారితోషకం పొందుతుంది. ఆషికా:-

కథలో రాజకుమారి సీరియల్ లో ఈమె నటిస్తున్నది.అవని పాత్రతో మంచి గుర్తింపు పొందింది.ఈమె రోజుకు రూ.12 వేలు తీసుకుంటుంది.

హరిత:-

ఈమె సీనియర్ సీరియల్ నటి.ఎన్నో సీరియల్స్ లో నటించింది.ప్రస్తుతం కుంకుమ పువ్వు, ముద్ద మందారం లో నటిస్తుంది.ఈమె రోజుకు రూ.12 వేలు తీసుకుంటుంది.

ప్రీతి నిగమ్:-

ఈమె సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తుంది.ఎటు అవకాశం వస్తే అటు వెళ్తుంది.ఈమె రోజుకు రూ.10 వేలు తీసుకుంటుంది.

సమీరా షరీఫ్:-

ఈమె పలు సీరియల్స్ లో నటిగా చేసింది.కొద్ది రోజులు కామెడీ షోకు యాంకర్ గా చేసింది.ఈమె రెమ్యూనరేషన్ రోజుకు రూ.10 వేలు.

తాజా వార్తలు