కరోనా ఎఫ్ఫెక్ట్ : అమెరికాలో తెలుగు ఎన్నారై జర్నలిస్ట్ మృతి...!!!

అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.

ఇప్పటివరకూ కరోనా బారినపడిన మృతిచెందిన వారి సంఖ్య 13 వేల కి చేరుకోగా కరోనా సోకి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు, హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారితో కలిసి మొత్తం 4 లక్షలకి చేరుకుంది.

దాంతో అమెరికా కారోనా బాధిత దేశాలు అన్నిటికంటే కూడా ప్రధమ స్థానంలో నిలిచింది.ఇదిలాఉంటే.

ఇప్పటి వరకూ అమెరికాలో ఎంతమంది వలస వాసులు మృతి చెందారనే విషయం మాత్రం తెలియడం లేదు.? అమెరికాలో కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతం న్యూయార్క్ ఈ ప్రాంతంలోనే సుమారు 30 వేల మంది వరకూ తెలుగు వారు ఉంటారు.ఇప్పటి వరకూ మృతి చెందిన వారందరూ న్యూయార్క్ సిటీ కి చెందినవారు కావడం గమనార్హం.

తాజాగా నిన్నటి రోజున న్యూయార్క్ నగరంలో ఉంటున్న తెలుగు ఎన్నారై జర్నలిస్ట్ మృతి చెందారు.దాంతో ఒక్క న్యూయార్క్ సిటీలో భారతీయుల మృతుల సంఖ్య అధికారికంగా 7 కి చేరుకుంది.

Advertisement

ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికా వచ్చి స్థిరపడిన కంచిబొట్ల బ్రహ్మ సుమారు 28 ఏళ్ళుగా అమెరికాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు.స్థానికంగా ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో కరస్పాండెంట్ గా పంచేస్తున్న ఆయనకీ కరోనా సోకడంతో పాటు ఊపిరి పీల్చుకోవడం కష్టం అయ్యింది .దాంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు.రోజులు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయన మృతి చెందినట్లుగా ఆయన కుమారుడు తెలిపారు.

అయితే ప్రభుత్వం అంత్యక్రియలకి కూడా తన తండ్రి మృతదేహం ఇస్తుందా లేదా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు