మెగాస్టార్ చిరంజీవితో ఇండియన్ ఐడల్ సింగర్ ప్రణతి.. ఫోటో వైరల్!

ఇండియన్ ఐడల్ (Indian Idol ) సింగింగ్ షోకి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ కార్యక్రమం తెలుగులో కూడా ప్రముఖ ఓటీటీ సమస్థ అయిన ఆహాలో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సింగర్స్ పరిచయం అయ్యారు.తెలుగు ఇండియన్‌ ఐడల్‌(Telugu Indian Idol) ద్వారా సింగర్‌గా పేరు తెచ్చుకున్న వారిలో ప్రణతి(Pranathi) ఒకరు.

తన అద్భుతమైన గాత్రంతో జడ్జీలతో పాటు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకున్నారు.ఈ విధంగా సింగర్ గా తనలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టిన ప్రణతి ఎంతోమంది సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకున్నారు.

ఇకపోతే తాజాగా ప్రణతి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ని కలిశారు.ప్రణతి మెగాస్టార్ ఇంటికి వెళ్లి అక్కడ మెగాస్టార్ దంపతులతో సరదాగా మాట్లాడటమే కాకుండా, మెగాస్టార్ దంపతులు ప్రణతి చేత కొన్ని పాటలు పాడించుకొని మరి విన్నారు.అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రణతి భవిష్యత్తులో మంచి సింగర్ కావాలని కోరుకుంటూ తనని ఆశీర్వదించారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ కూడా ముందుంటారనే విషయం మనకు తెలిసిందే.ఇలా పలు కార్యక్రమాలకు వెళ్లిన ఈయన ఎంతోమందికి తన సినిమాలలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చి అవకాశాలు కూడా కల్పించారు.చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్(Bhola Shankar) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు