మూడు నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్ ల గురించి ఎక్కువగా తెలియదు.అసలు ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటేనే ఎక్కువ శాతం మందికి కరోనా సమయంలో తెలిసింది.
ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ బిజినెస్ విపరీతంగా పెరిగింది.నాలుగు అయిదు సంవత్సరాల క్రితం ఉన్న ఓటీటీ బిజినెస్ తో పోల్చితే ఇప్పుడు వందల రెట్లు పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దేశ వ్యాప్తంగా ఓటీటీ వినియోగదారుల సంఖ్య ఎలా అయితే పెరిగారో తెలుగు లో కూడా ఓటీటీ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగారు.ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కు సినిమాల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.
ఇక సినిమాలకు కూడా భారీ మొత్తంలో ఓటీటీ వల్ల డిమాండ్ పెరిగింది అనడంలో సందేహం లేదు.దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి.
వెబ్ సిరీస్ లను ఎక్కువగా చూస్తున్న ప్రేక్షకులకు హిందీ వారు ఉంటే ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది వెబ్ సిరీస్ లను చూస్తున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.
అందుకే తెలుగు ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఇప్పుడు వెబ్ సిరీస్ ల పై పడుతున్నారు.
ఏకంగా స్టార్ హీరో వెంకటేష్ కూడా వెబ్ సిరీస్ లో నటించాడు.రానా, నాగ చైతన్య, సమంత ఇంకా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అయ్యారు.
వారి నుండి ఇప్పటికే వెబ్ సిరీస్ లు వచ్చాయి.మరి కొన్ని రాబోతున్నాయి.ముందు ముందు రోజుల్లో మెగా ఫ్యామిలీ నుండి కూడా వెబ్ సిరీస్ లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇంతకు ముందు వెబ్ సిరీస్ అంటే పాతిక నుండి 50 లక్షల వరకు బడ్జెట్ తో ఉండేది.
కాని ఇప్పుడు కోట్లలో ఖర్చు చేస్తున్నారు.నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ వారు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ వెబ్ సిరీస్ లను తెలుగు లో కూడా నిర్మిస్తున్నారు.
ప్రతి వెబ్ సిరీస్ ను ఏదో ఒక భాష లో నిర్మించి అన్ని భాష ల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు.వెబ్ సిరీస్ లను చూడాలంటే ఓపిక ఉండాలి.
తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఓపిక ఉన్న వారే అందుకే వారికి హ్యాట్సాఫ్.







