తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 24 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

54

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: సా.05.26 నుంచి 06.58 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 24 Thursday 2020-త�

దుర్ముహూర్తం: సా 09.52 నుంచి 10.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 24 Thursday 2020

మీ మంచి బుద్ధి మీకు సహాయం చేస్తుంది.ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు.

ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పిస్తుంది.మీకోసం మీరు సమయాన్ని కేటయించుకోవాలి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 24 Thursday 2020
Advertisement

మీ సంతానం నుంచి ఆర్ధిక లాభాలు ఉంటాయ్.వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు.ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

మిథునం:

వ్యాపారాల్లో మంచి లాభాలు చూస్తారు.మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు మీకు కీడు చేయాలనుకుంటారు.జాగ్రత్తగా ఉంటే మంచిది.

కొన్ని విషయాల్లో చికాకులు ఎదురవుతాయ్.కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది.

కర్కాటకం:

అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉంటారు.మీ ఆర్ధిక పరిస్థితి ఈరోజు దృడంగా ఉంటుంది.పిల్లలకు తమ భవిష్యత్తుపై ఆలోచనలు కొనసాగేలా చూడాలి.

కొన్ని అంశాలు నిరాశకు గురి చేసినప్పటికీ మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు.

సింహం:

ఇతరులను విమర్శించడానికే మీ సమయాన్ని వృధా చెయ్యద్దు.ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని చేడు అలవాట్లకు దూరం అవ్వాలి.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు అలోచించి పెట్టాలి.

రోజు చివరిలో భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

కన్య:

ఎవరో చేసిన నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మీకు సమస్యలు వస్తాయ్.ఆర్ధిక నష్టం కూడా అవుతుంది.మీ అభిరుచికి తగినట్లు మీరు ఇంటి వాతావరణంలో మార్పులు చేసుకుంటే మంచిది.

కొన్ని అంశాలు బాధ పెట్టినప్పటికి మీ కుటుంబ సభ్యుల కారణంగా మీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు.

తులా:

తల్లితండ్రుల నుంచి ఆర్థికసాయం అందుతుంది.కొన్ని నష్టాలు కలిగి మీకు కోపం తెప్పిస్తాయ్ కానీ అది ఇతరులపై చూపిస్తే అంతకు మించిన నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.అందుకే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని పక్కవారితో ప్రవర్తించండి.

వృశ్చికం:

అనవసరమైన విషయాల్లో దూరకండి.మానసిక ప్రశాంతత ఎంతైనా అవసరం.కొందరి సహాయంతో ఆర్ధికంగా లాభాలను చూస్తారు.

కుటుంబసభ్యులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

ధనస్సు:

కొందరి రాక మీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది.ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకుంటే మంచిది.తెలివిగా డబ్బు ఆదా చెయ్యండి.ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లేదా జీవిత భాగస్వామి సలహా తీసుకోండి!

మకరం:

జీవిత భాగస్వామితో కలిసి ఇంట్లో పెండింగ్ ఉన్న పనులు, కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకోండి.ఉద్యోగ పరంగా మీరు ప్రశంసలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు.

కుంభం:

మీ పెద్దవారు మీకు ఎంతో సపోర్ట్ గా ఉంటారు.వ్యక్తి జీవితంలో మీరు కాస్త ఒత్తిడికి గురవుతారు.మీకు ప్రశాంతత కరువవుతుంది.

అనవసరమైన వాటిలో దూరి మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి.ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీ సొంతం అవుతుంది.

మీనం:

ఈరోజు ఒక సంతోషకరమైన వార్తను వింటారు.ఆర్ధిక లాభాలు బాగా ఉంటాయ్.పాతమిత్రులను కలిసి సాయింత్రం మంచి సమయాన్ని గడుపుతారు.

ఉద్యోగంలో మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది.

తాజా వార్తలు