తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 11 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5:50.సూర్యాస్తమయం: సాయంత్రం 6:04.

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు.అమృత ఘడియలు: రా.2.20 నుంచి 4.08 వరకు.దుర్ముహూర్తం: ఉ.8.16 నుంచి 9.05 వరకు.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్ధికంగా బాగుంటారు.ఆరోగ్యంగా కూడా బాగుంటారు.ఏదైనా ఒక పని చేసే ముందు మంచి చెడుల గురించి అలోచించి నిర్ణయం తీసుకోండి.

ఉద్యోగంలో ఉన్నవారికి అనుకోని సమస్యలు వస్తాయ్.జాగ్రత్తగా ఆలోచనతో ముందడుగు వెయ్యడం మంచిది.

వృషభం:

ఆరోగ్యం క్రమంగా సెట్ అవుతుంది.ఆందోళన చెందకండి! మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Advertisement

వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు.ఇక ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త పనులు నేర్చుకుంటారు.

తీరిక లేకుండా గడుపుతున్న వారికి మంచి సమయం దొరుకుంతుంది.

మిథునం:

ఎన్ని సమస్యలు వచ్చిన నవ్వడం మాత్రం మర్చిపోకండి.మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు.ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయ్.

ఈరోజు సాయింత్రం మిత్రులతో, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

మిమ్మల్ని కొందరు బాధపెడుతారు.ఎంత కుదిరితే అంత తక్కువ మాట్లాడండి.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

పోదుపు చెయ్యాలి అనే ఆలోచనతో పొదుపు చేసేందుకు ముందడుగు వేస్తారు.ఆఫీసులో మంచి మార్పును కోరుకుంటాయి.

Advertisement

కొన్ని విషయాలను మీ అహం అంగీకరించదు.అది మంచి పద్ధతి కాదు.

సింహం:

కొన్ని సమస్యలు వస్తాయ్.వాటిని ఆవేశంతో కాకుండా అలోచించి ఓర్పుతో నిర్ణయం తీసుకుంటారు.చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్తారు.

పాత స్నేహితులను కలిసి కొంత సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

కన్య:

అవసరం అయినా డబ్బు లేకపోవడం వల్ల ఇంట్లో కొన్ని ఇబ్బందులకు గురవుతారు.ఆ సమయంలో అలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అయ్యి సంతోషంగా ఉంటారు.

తులా:

కొన్ని పనులలో అసలు సమయం ఉండదు.ఇక విద్యార్థులు అయితే విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిరాశకు గురవుతారు.

వృశ్చికం:

కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు.వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతారు.

గతంలో పొదుపు చేసిన డబ్బు ఇప్పుడు ఉపయోగపడుతుంది.తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కు అనుగుణంగా ఒప్పించడంతో పాటు కొన్ని సమస్యలు కూడా తీరుతాయి.

ధనస్సు:

ఇతరులకు చేదు చేయాలన్న ఆలోచనలు పక్కన పెట్టండి.కొత్త రకమైన ఆలోచనలు మీ జీవితాన్ని వృథా చేస్తాయ్.ఈరోజు ఎటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకుంటే మంచిది.

ఇక ఆఫీస్ లో పని చేసే వారికి ఎన్నో రోజుల నుంచి వచ్చిన ఇబ్బందులు అన్ని తీరిపోతాయి.

మకరం:

పని చేసే చోట మీ పై వారి నుంచి వత్తిడికు గురవుతారు.ఇంటికో వారితో తిట్లు తింటారు.

మీకు చిరాకును తెప్పించి పనిపై ఏకాగ్రత లేకుండా ఉంటారు.ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆర్థికనష్టాలను ఎదుర్కొని రోజు అంత ఇబ్బందికి గురవుతారు.

కుంభం:

ఈరోజు డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతారు.అంతేకాదు రోజు చివరకు ఆర్ధికంగా ఇబ్బందులకు ఎదర్కొంటారు.ఇక అనుకోని శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది.

మీరు పడిన కష్టానికి మరెవరికో ప్రశంసలు సొంతం అవుతాయి.జాగ్రత్త పడండి.

మీనం:

సానుకూలమైన ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి.మీరు కొత్త వ్యాపారాలు చెయ్యడం ప్రారంభిస్తారు.

ఇంటి వాతావరణం కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది.ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది.

రోజు చివరికో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

తాజా వార్తలు