తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 1 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

49

రాహుకాలం: మ.02.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.20 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 1 Sunday 2020-తెల

దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 1 Sunday 2020

ఈరోజు మేష రాశి వారికి సహోద్యోగుల సలహాతో మంచి ప్రయోజనాలను పొందుతారు.ఈ రాశి వారికి రాజకీయ సామాజిక రంగాలలో ప్రత్యర్థుల నుంచి ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అనుకోకుండా అతిథులు రావడం ద్వారా ఖర్చులు పెరుగుతాయి.

ఈ రాశి వారికి అదృష్టం ఈ రోజు 85 శాతం మద్దతు తెలుపుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 1 Sunday 2020
Advertisement

వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.మీరు పనిచేసే ప్రదేశంలో మీ పై అధికారుల నుంచి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.ఇందులో భాగంగానే వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శుభకార్యాలకు ఖర్చుచేస్తారు.దీనివల్ల మీకు సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

ఈ రాశివారికి ఈ రోజు 82 శాతం అదృష్టం వరిస్తుంది.

మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో మానసిక ఉల్లాసంతో గడుపుతారు.నీకున్న తెలివితేటలు,నైపుణ్యంతో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశివారు సంతానం నుంచి శుభవార్త లను వింటారు.

మీ సోదరి, సోదరీమణుల సహాయంతో చేసేటటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశి వారికి 84 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

కర్కాటకం:

ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు.వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారు.ఈ రాశివారు వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం ఎంతో మంచిది.

లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకొని మెలగడానికి, ఇది సరైన సమయం ఈరోజు 78 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

సింహం:

సింహ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు తలెత్తుతాయి.ఈ రాశి వారు ఈరోజు నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు.

ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.ఈ రాశివారికి ఈ రోజు 82 శాతం మద్దతు లభిస్తుంది.

కన్య:

విద్యార్థులు ఎంతో కష్టపడాల్సి సమయం.విదేశాలలో నివసించే పని చేసే వారికి ఈ రోజు ఎంతో అనుకూలమైన సమయం.సోదరీ వివాహ విషయంలో ఆందోళన ముగిస్తుంది.

ఈ రాశి వారు చేపట్టిన ఇటువంటి పనుల లోనైనా ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి ప్రయత్నిస్తే చివరికి విజయం మీ సొంతమవుతుంది.ఈరోజు 85 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

తులా:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశి వారు ఈ రోజు భూములు కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

వ్యాపార రంగంలో లాభాలను అందుకుని కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి 84 శాతం అదృష్టం మద్దతు తెలుపుతూనే.

వృశ్చికం:

ఈరోజు ఈ రాశివారు పై ఉద్యోగుల ప్రభావం మీ పై అధికంగా పడుతుంది.విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.ఎప్పుడో ఆగిపోయిన పనులను మీ స్నేహితులు, బంధువుల సహాయంతో ఆ పనులను పూర్తి చేసుకుంటారు.

వివాహితులకు ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.కొత్తగా ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలి అనుకునేవారికి ఇది సరైన సమయం.

ఈ రాశి వారికి అదృష్టం 86 శాతం కలిసి వస్తుంది.

ధనస్సు:

ఈరోజు ధనుస్సు రాశి వారికి కుటుంబం, పనిచేసే ప్రదేశాలలో తీవ్ర ఇబ్బందులు ఇది రావడం వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు.సంతానం నుంచి శుభవార్తలు వింటారు.ఉపాధి కోల్పోయిన వారికి,ఉపాధి పొందేందుకు ఇది సరైన సమయం.

ఈ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.ఈరోజు అదృష్టం 80 శాతం మద్దతు తెలుపుతుంది.

మకరం:

ఈ రాశి వారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఎంతో అవసరం.కొన్ని సామాజిక పనులు చేయడంవల్ల కీర్తి పెరుగుతుంది.ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు తగాదాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.

వ్యాపారంలో లాభదాయకంగా ఉండడమే కాకుండా, ప్రభుత్వం నుంచి కూడా లాభాలు అందుకుంటారు.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.

కుంభం:

ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.ఆఫీసులో మీ పని సామర్థ్యం చూసి పై అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తారు.కొన్ని అత్యవసర కారణాలవల్ల ఇతరులతో రుణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ రాశివారు జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉన్నాయి.ఏ రాశి వారికి ఈ రోజు 82 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

మీనం:

వ్యాపార రంగంలో అధిక లాభాలు వస్తాయి.మీ గురువుల నుంచి ఆశీర్వాదం పొందడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి.ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజుతో ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ రాశి వారికి సోదరీ సోదరీమణులకు బంధం మరింత బలపడుతుంది ఈ రాశి వారికి అదృష్టం86 శాతం కలిసి వస్తుంది.

తాజా వార్తలు