అనుమానాస్పద స్థితిలో తెలుగు యాంకర్ మృతి...

ఎన్నో ఆశలతో, కలలతో తన నటనను నిరూపించుకొని సినీ పరిశ్రమలో నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని సినీ పరిశ్రమకు వచ్చినటువంటి ఓ యువ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే శాంతి అనే యువతి సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే ఇందులో భాగంగా ఈమె స్థానిక నగరంలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీ లో నివాసం ఉంటోంది.అయితే ఈరోజున ఉన్నట్లుండి శాంతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Telugu Anchor, Viswashanthi, Shanthi, Shanthi Death, Tollywood, Telugu Anchor Sh

అయితే ఈ విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.అంతేగాక శాంతి మృతికి సంబంధించి నటువంటి ఆధారాల కోసం ఆమె నివాసాన్ని మరియు  మృత దేహం లభించిన ప్రదేశాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

అంతేగాక డాగ్ స్క్వాడ్ టీం కి కూడా సమాచారాన్ని చేరవేశారు.అలాగే స్థానికులు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు