సినిమాలలో హీరో హీరోయిన్లు రాణించాలంటే కేవలం అందం అభినయం మాత్రమే కాదు వారి శరీర ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం.కాబట్టి సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వారి ఫిట్నెస్ కోసం అనేక రకాల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు చేస్తూ.
పడరని పాట్లు పడుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం.నిత్యం యోగాలు, మెడిటేషన్, వ్యాయామం లాంటి అనేక వాటిని వారి దినచర్యలో భాగంగా చేస్తుంటారు.
ఇకపోతే తాజాగా ఈ లిస్టులో హీరోయిన్స్ కోసం ఐస్ బాత్( Ice Bath ) కొత్తగా చేరింది.
ఈ ఐస్ బాత్ వల్ల శరీరంలోని నరాలను బలపరుచుకోవడం ద్వారా ఫిట్ గా ఉండొచ్చు అని హీరోయిన్స్ భావిస్తున్నారు.
అయితే అందరిలాగా నేను చేస్తే ఏం బాగుంటుంది అని అనుకుందేమో మన తెలుగు హీరోయిన్ సునైనా.( Telugu Heroine Sunaina ) అందుకే కాబోలు అందరికీ భిన్నంగా ఐస్ మెడిటేషన్( Ice Meditation ) చేస్తూ అందర్నీ అరేరే.
అనిపిస్తుంది.ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఫొటోస్ లో చూస్తే ఓ టబ్ లో ఐస్ ముక్కల నడుమ హీరోయిన్స్ సునయన మెడిటేషన్ చేస్తున్నట్లు కనపడుతుంది.

ఇన్స్పెక్టర్ సూచనలు హీరోయిన్ ఇలా చేశారు.మెడిటేషన్ ట్రైనర్ సూచనలు తీసుకుంటూ ఇలా ఐస్ టబ్ లో చాలాసేపు మెడిటేషన్ చేసింది హీరోయిన్.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ,ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
వీటిని చూసిన నెటిజెన్స్ మెడిటేషన్ చూశాం కానీ.ఇలాంటి మెడిటేషన్ ఎప్పుడు తాము చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హీరోయిన్ విషయానికొస్తే.మొదటగా మాడల్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత తెలుగులో ‘కుమార్ వర్సెస్ కుమారి’( Kumar Vs Kumari ) అనే సినిమాతో పరిచయం కాగా టాలీవుడ్లో మరో అవకాశం రాకపోవడంతో.తమిళ సినిమాలకు వెళ్ళింది.అక్కడ పలు చిత్రాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది.అయితే స్టార్ డం కోసం అక్కడ పోరాడుతుందని చెప్పవచ్చు.తాజాగా సునయన రెజినా( Regina ) అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది.







