ఒకేసారి వీడియో కాల్ లో వెయ్యి మందిని కలిపే ఫీచర్ ని తీసుకోచ్చిన టెలిగ్రామ్..!

ఒకప్పుడు టెలిగ్రామ్ అంటే ఓ వెలుగు వెలిగింది.ఇప్పటికీ చాలా మంది టెలిగ్రామ్ యాప్ ను వినియోగిస్తున్నారు.

టెలిగ్రామ్ ద్వారా వీడియో లింకులు పంపించుకుంటూ ఫోటోలు షేర్ చేసుకుంటూ యాప్ ను వాడుతున్నారు.తమ యూజర్ల కోసం టెలిగ్రామ్ సంస్థ రకరకాల ఫీచర్లను ముందుకు తెస్తోంది.

తాజాగా టెలిగ్రామ్ యాప్ ఓ శుభవార్తను చెప్పింది.తమ వినియోగదారుల కోసం అద్బుతమైనటువంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.

ఇకపై టెలిగ్రామ్ యాప్ లో 1000 మంది ఒకేసారి వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంది.సరికొత్త క్వాలిటీతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

Advertisement

ఇందులో గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే విధానంలో ఇప్పుడు 1000 మందిని యాడ్ చేసి మాట్లాడుకోవచ్చు.అంతేకాకుండా ఆ వీడియో మెస్సేజులను కూడా యాప్ లో రికార్డు చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఇవే కాదు ఇంకా చాలా రకాల ఫీచర్లను టెలిగ్రామ్ అందుబాటులోకి తెచ్చింది.మరిప్పుడు ఆ టెలిగ్రామ్ యాప్ తీసుకొచ్చిన ఆ ఫీచర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

30 మంది వినియోగదారులు పాల్గొనవచ్చు.అలాగే 1000 మంది పాల్గొనవచ్చు.దీంతో ఆన్‌లైన్ పాఠాలు వినే అవకాశం ఉంది.

టెలిగ్రామ్ యాప్ లో ఇకపైన హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేసి షేర్ చేయొచ్చు.అదేవిదంగా వీడియోలను రికార్డు చేసేటప్పుడు మీ మొబైల్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ ను ప్లే చేసి చూడొచ్చు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అంతేకాదు వీడియో ప్లే బ్యాక్ స్పీడ్ ను కూడా మార్చుకోవచ్చు.0.2x, 0.5x, 1.5x, 2x స్పీడ్స్‌తో ఇకపై టెలిగ్రామ్ లో వీడియోలను చూసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.వీడియో ఫైల్స్ షేర్ చేసినప్పుడు టైమ్ స్టాంప్ క్రియేట్ చేసే ఫీచర్ ఉంది.

Advertisement

ఉదాహరణకు మీరు 0:30 అని టైమ్‌స్టాంప్ లింక్ క్రియేట్ చేసినట్లైతే ఆ టైమ్ నుంచే వీడియోను ఇకపై చూసే అవకాశం ఉంటుంది.టెలిగ్రామ్‌లోని యాప్ లో ఛాట్స్ ఒక రోజు, ఒక వారంలో దానంతట అవే డిలీట్ చేసే అవకాశం ఉంది.

ఇకపై యాప్ లో ఒక నెల రోజుల పాటు టైమ్ సెట్ చేసుకునే అవకాశం ఉంది.

తాజా వార్తలు