తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనపై కొనసాగుతున్నాయి.అయితే అసలు రాహుల్ గాంధీ వస్తాడా.
లేదా కాంగ్రెస్ నేతలు మార్పులు చేర్పులు చేస్తారా .అనే ప్రశ్న ఇతర పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది.అయితే ఈ నెలలో రాహుల్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు .దీనికి రాహుల్ గాంధీ కూడా ఓకే చేసి 6, 7 తేదీలు ఖారారు చేశారు.వరంగల్ నిర్వహించే సభ టార్గెగా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది అని చేప్పవచ్చు.మరోవైపు రాహుల్ రాకపై ఓయూలో ఉద్రికత్తలో చోటుచేసుకుంటున్నాయి.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు… పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతనే ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెట్టాలని టీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి.ఈ నెల 6, 7న రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.
దాంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఫోకస్ అంతా రాహుల్ సెంట్రిక్ గా మారింది.ఓ వైపు వరంగల్ లో రైతు సంఘర్షణ సభ మరోవైపు హైదరాబాద్ ఓయూ పర్యటనతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
ఓయూకు రాహుల్ రావాల్సిన అవసరం లేదని టీఎర్ఎస్ నేతలు చేస్తున్న రాద్దాంతంతో హస్తం, కారు పార్టీల మధ్య ఫైట్ మరో లెవల్ కు వెళ్ళింది.

మరోవైపు టీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది.ఇటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలతో అట్టుడికిస్తోంది.
నేతల అరెస్ట్‌లను నిరసిస్తూ కేసిఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు ఇందిరా పార్క్ వద్ద యువజన కాంగ్రెస్ ధర్నా చేసింది.అసలు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానంటే టీఆర్ఎస్‌లో ఎందుకు భయమని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.
చారిత్రాత్మక యూనివర్సిటీని ఒక ఎంపిగా రాహుల్ గాంధీ సందర్శిస్తే తప్పేంటని హస్తం పార్టీ వాదన.
మరోవైపు రాహుల్ గాంధీ పబ్ వీడియో హల్ చల్ చేస్తుంది.ఖాట్మండు నైట్ క్లబ్లో నిర్వహించిన పార్టీలో రాహుల్ గాంధీ కనిపించారు.చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది.
దీంతో నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.కష్టాల్లో ఉన్న పార్టీని వదిలేసి రాహుల్ గాంధీ.
నేపాల్‌లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.అయితే మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా పని చేసిన భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం తప్పా రాహుల్ ది పొలిటికల్ విజిట్ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.వీసీ, కేసిఆర్ విజ్ఞత తో ఆలోచించాలని కోరుతున్నారు.
టీఆర్ఎస్ నేతల వైఖరి, వీసి తీరును నిరసిస్తూ వీసి ఛాంబర్ ముందు నిరసన తెలిపిన విద్యార్థుల మీద నాన్ బెయిల్ కేసులు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పు పడుతోంది.ఓయూ లో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడం, అనంతర పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
అందులో భాగంగా చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లోఉన్న విద్యార్థులతో రాహుల్ గాంధీ ములాఖాత్ కు టీపీసీసి ప్లాన్ చేసింది.







