సౌదీలో తెలంగాణ యువకుడు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యువత ఉపాధి కోసం వేరే దేశాలకు వెళ్లి ఉద్యోగం లేదా పని చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మన దేశం నుంచి కూడా వేరే దేశాలకు యువత ఉపాధి కోసం వెళ్తుటారు.

మన దేశం నుంచి సౌదీ అరేబియాకు కూడా మన దేశ యువత చాలా మంది వెళ్తూనే ఉంటారు.ఎండలు సౌదీ అరేబియాలో ఎంత ఎక్కువగా ఉంటాయో చలి కూడా అదే స్థాయిలో ఉంటుంది.

ఆ దేశంలో చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు రాత్రి పూట పెద్ద సంఖ్యలో హీటర్లను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ క్రమంలో ప్రతి చలికాలంలో సౌదీ అరేబియా, కువైట్ దేశాలలోనీ తెలుగువారు అనేకమంది భారతీయులు ప్రాణాలను కోల్పోతున్నారు.

తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం మాస్కాపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల అబ్దుల్ జహీర్ సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో హీటర్ పొగ కారణంగా మరణించాడు.చలి తీవ్రత నుండి బయటపడడానికి రాత్రి హీటర్ స్విచ్ ఆన్ చేసి పడుకున్నా జహీర్ అతడి ఇద్దరు సహచరులు గాడ నిద్రలో ఉండి హీటర్ నుంచి పొగ రావడం గమనించలేదు.

Advertisement

ఈ పోగలో ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉండడంతో జహీర్ ప్రాణాలను కోల్పోయాడు.మిగిలిన ఇద్దరూ అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరారు.ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.

ఈ కార్యక్రమంలో సంబంధించి అధికారిక ప్రక్రియను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలో తెలుగు ప్రావసి సామాజిక కార్యకర్తలు ముజ్జమిల్ షేక్, అబ్దుల్ రఫీక్ లు ప్రయత్నాలు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం జరిగిన భారీ బస్సు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన జహీర్ అనూహ్యంగా మృతి చెందాడు.

అతని తండ్రికి క్యాన్సర్ తో మరణించారు.అప్పట్లో తండ్రి చికిత్స కోసం జహీర్ సౌదీ అరేబియాలో తెలిసిన వారి నుంచి పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు