తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
తెలంగాణ బలమైన ఆర్థికశాఖగా ఎదిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.తెలంగాణ మోడల్ జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు 12 శాతం మాత్రమే వృద్ధిరేటు ఉందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రారంభిస్తోంది.
దేశం ఆచరిస్తోందని తెలిపారు.ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాన్ని తట్టుకొని తెలంగాణ నిలబడిందని చెప్పారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.