అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న తెలంగాణ !

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు కొట్లాటలే తప్ప ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించడం కానీ లేక ప్రత్యర్థి పార్టీల సభ్యులకు గౌరవివ్వటం కాని మచ్చుకు కూడా ఈ మధ్య కనిపించడం లేదు.

అయితే తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) మాత్రం దేశంలోని ఇతర అసెంబ్లీలకు భిన్నంగా పూర్తి సహృద్భావ వాతావరణంలో సమావేశాలు జరుగుతూ ఉండటం తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది.

ఇక్కడ కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నా కూడా అదంతా ఎవరి మర్యాదకు లోటు లేకుండా సభ్యులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.ఒకరిపై ఒకరు విమర్శలు బాణాలు వేసుకుంటున్నా కూడా ప్రత్యర్ధి గౌరవానికి లోటు లేకుండా పూర్తిస్థాయి అర్థవంతమైన పదాలు మాత్రమే ఉపయోగిస్తూ తమ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఇరు పార్టీల సభ్యులు ప్రాధాన్యత ఇవ్వటం హర్షించాల్సిన విషయం అనేది చెప్పాలి.

ఒకరకంగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలను కంపేర్ చేసి చూసినప్పుడు తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ గొప్పతనం అర్థమవుతుంది.

Telangana Is Increasing The Respect Of The Assembly Details, Telangana, Telangan

దీనిలో రెండు పక్షాలకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.నిజానికి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గౌరవప్రద స్తాయిలోనే జరుగుతూ ఉన్నాయి.ముఖ్యమంత్రిగా కేసీఆర్( KCR ) ఉన్నపుడు కూడా కాంగ్రెస్పై విమర్శలు చేస్తూనే కాంగ్రెస్లోని కొంతమంది నాయకులను ప్రత్యేకంగా అభినందించిన సందర్భాలను కనబడేవి .ఇప్పుడు కూడా బిఆర్ఎస్( BRS ) ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్( Congress ) అదే స్థాయిలో బిఆర్ఎస్ ను గౌరవిస్తూ ఉండటం

Telangana Is Increasing The Respect Of The Assembly Details, Telangana, Telangan
Advertisement
Telangana Is Increasing The Respect Of The Assembly Details, Telangana, Telangan

కేవలం అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తూ ఉండటంతో ప్రజాస్వామ్యం గౌరవించబడుతున్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇదే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) కూడా అందుపుచ్చుకుంటే చాలా బాగుంటుందని రాజకీయ నిపుణుల మాట .కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రాజకీయాలు రోజు రోజు కీ ప్రతీకార దొరణి లోకి మారిపోతూ ఉండడం .వ్యక్తిగత స్తాయిలో పార్టీల మధ్య పగలు పెరుగుతున్న వాతావరణ కనిపించడం ప్రజాస్వామ్య వాదులను కూడా ఆందోళన కు గురి చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు