స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది.ఈ మేరకు న్యాయవాది భాస్కర్ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేసింది.220 సర్పంచ్ లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5,364 వార్డు సభ్యుల ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికలకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న పదవులకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.