తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, 3.80లక్షల మంది అప్లై చేసుకున్నారు.పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.8 రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని, స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు.







