ప్రస్తుత కాలంలో ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు పోటీ చేసి గెలవడం ఒకెత్తయితే , గెలిచిన తర్వాత అభ్యర్థులను కాపాడుకోవడం తలకు మించిన భారంగా తయారవుతోంది.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు మరొక పార్టీకి జంపవడం మనం చూస్తూనే ఉన్నాం.
అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ ( Telangana Elections ) లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు.అయితే ఈ జంప్ విధానానికి చెక్ పెడుతూ కాంగ్రెస్ సరికొత్త వ్యూహం రచించుతోంది.
ఆ వ్యూహంతోనే ఎన్నికల బరిలో అభ్యర్థులను దించాలని చూస్తోంది.మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.
ఇప్పటికే కాంగ్రెస్ ( Congress ) మొదటి జాబితా రెడీ అయిందంటూ విపరీతంగా ప్రచారం సాగుతోంది.ఈసారి ఎలాగైనా బిఆర్ఎస్ ను పడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో నేతలంతా ఉన్నారు.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.కానీ ఈసారి టికెట్లు ఇచ్చే సమయంలో కొన్ని షరతులు విధించి మరీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది.

టిపిసిసిగా రేవంత్ రెడ్డి ( Revanth reddy ) వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.బిఆర్ఎస్ కు మొదట్లో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి అనే టాక్ కానీ దాని నుంచి కాంగ్రెస్ అనే స్థాయికి ఎదిగింది.రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని తప్పకుండా చెబుతున్నారు.ఎలాగైనా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని తీవ్రమైన కసరత్తులు చేస్తోంది రేవంత్ టీం.ఈ సందర్భంగా బిఫాం ఇచ్చే అభ్యర్థులకు బాండ్ పేపర్ స్పీకర్ ఫార్మాట్ లో పార్టీకి లేఖ సమర్పించే మెలిక పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ కు పార్టీలో గెలిచి ఆ తర్వాత అవసరాల కోసం పార్టీలు మారిన ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందుల పాలైంది.కాబట్టి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి బీఫాం తీసుకునే వారు తప్పనిసరిగా ఈ షరతులు ఒప్పుకుంటేనే బీఫాం ఇస్తామనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ప్రతి నేత బీసీలైతే 25000, ఓసి లైతే 50వేల రూపాయలు డిపాజిట్ చేయాలని, ఎస్సీ,ఎస్టీలకు ఎలాంటి డిపాజిట్ లేదని తెలియజేసింది.దీని ద్వారా కూడా ఒక నియోజకవర్గం నుంచి ఎంతమంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ విధంగా అనేక కసరత్తులతో కాంగ్రెస్ ఈసారి బరిలోకి దిగనున్నట్టు సమాచారం.







