తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల..!!

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంక నెలరోజులు టైం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే పలు హామీలు ప్రకటించడంతో పాటు.

 Telangana Congress Second List Released Telangana Elections, T Congress Second L-TeluguStop.com

పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా నేడు తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )రెండో జాబితా విడుదల చేసింది.

తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా లేటెస్ట్ గా విడుదల చేసిన రెండో లిస్టులో 45 పేర్లను ప్రకటించడం.

సిరిపూర్ నియోజకవర్గం నుండి రావి శ్రీనివాస్, అసిఫాబాద్ నుంచి శ్యామ్, హుజూరాబాద్ నుంచి వడితల ప్రణవ్, సిద్దిపేట నుంచి పూజల హరికృష్ణ, మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి, హుస్నాబాద్ నుండి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ), ఖమ్మం నుండి తుమ్మల( Thummala Nageswara Rao ), పాలేరు నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుండి రావూరి ప్రకాష్ రెడ్డి, ఖైరతాబాద్ నుండి పి.విజయరెడ్డి, చొప్పదండి నుండి మేడిపల్లి సత్యంకు తదితరులకు ఈ రకంగా 45 మంది అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయడం జరిగింది.ఖానాపూర్ నుండి వెడ్మా బొజ్జు, అదిలాబాదు నుండి కంది శ్రీనివాస్.

గద్దర్ కూతురు వెన్నెలాకు కూడా ఈ లిస్టులో కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడం జరిగింది.సో ఈ రకంగా తెలంగాణ కాంగ్రెస్ మొదటి, రెండు లిస్టులో కలిపి మొత్తం 100 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జరిగింది.

దీంతో ఇంకా 19 మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube