తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం కూడా లేదు.ఈ సమయంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ మొదలుకుని ప్రతి ఒక్క పార్టీ కూడా తెగ హడావుడి చేస్తోంది.
పెద్ద ఎత్తున ముందస్తు ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) విజయాన్ని సొంతం చేసుకుంది.
దాంతో తెలంగాణ లో కూడా అదే ఫలితం రిపీట్ అవ్వబోతుంది అంటూ ఆ పార్టీ నాయకులు ధీమా తో ఉన్నారు.ఈ సమయంలో పార్టీ నాయకత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పకుండా భారీ విజయాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అందుకే పార్టీ సీట్ల ఎంపిక విషయం లో ఇప్పటికే రేవంత్ రెడ్డి కి( Revanth Reddy ) పార్టీ అధినాయకత్వం కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.పది పదిహేను మంది సీనియర్ ల విషయంలో మినహా ఇతర స్థానాల్లో రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యత ను అప్పగించారు అంటూ వార్తలు వస్తున్నాయి.రేవంత్ రెడ్డి తన యొక్క సర్వే లతో ఆశావాహులకు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.పార్టీ ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవడం కోసం రేవంత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగానే రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వం నుండి కీలక పవర్ తీసుకు వచ్చాడు అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.వచ్చే ఎన్నికల్లో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ పై( BRS ) గెలిచేది మేము అంటూ బీజేపీ ( BJP ) తీవ్రంగా ప్రతిఘటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇలాంటి సమయంలో బీజేపీ యొక్క వ్యూహం ఏంటి అనేది చూడాలి.రాష్ట్ర నాయకత్వం లో మార్పు తీసుకు రావడం వల్ల పార్టీ ని గెలిపించుకోవాలని భావిస్తున్నారట.అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.