తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు జైలు జీవితం చుట్టూ తిరుగుతున్నాయి.జైలు జీవితం గడిపి వచ్చిన నువ్వు నాకెంది చెప్పేది అని ఓ నాయకుడు అంటుంటే మీ అన్న జైలు జీవితం గడపలేదా? ఇప్పుడు నువ్వు వెళ్లే పార్టీలోని కేంద్రం పెద్దల్లో ఒకరు జైలు జీవితం గడపలేదా? అని మరో టాప్ కాంగ్రెస్ లీడర్ అన్నారు.ఈ మాటల తూటాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య నడుస్తున్నాయి.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కబ్జా చేశాడని, ఎన్నో ఎళ్లుగా పార్టీకి సేవలందించిన సీనియర్లను అవమానిస్తూ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కంకణం కట్టుకున్నాడని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తుంటే.
కాంట్రాక్టుల కోసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీలోకి వెళ్తున్నాడని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలా పేరుంది.
ప్రస్తుతం వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా కొనసాగుతుంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చాలా ఏళ్లుగా విదేయులుగా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలతో కలిసి స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేశారు.అయితే, టీపీసీసీ పదవి కోసం అన్నదమ్ములిద్దరూ పోటీ పడ్డారు.
తీరా కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో వీరిద్దరూ హస్తిన నిర్ణయంపై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు.
అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక తనకు అనుకూలవర్గాన్ని ఏర్పాటు చేసుకుని సీనియర్లను అవమానిస్తున్నాడని గాంధీ భవన్ పరిసరాల్లో టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా పార్టీలో చేరికలను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని, తమకు నచ్చని వారికి పార్టీలో అందలం ఎక్కిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడినా.వెంకటరెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే మునుగోడులో మీటింగ్ పెట్టి రేవంత్ అండ్ కో.కోమటి రెడ్డి బ్రదర్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.తమ్ముడితో పాటే అన్నకూడా వెళ్లాలనుకుంటే వెళ్లిపోవాలని బూతు పదజాలంతో అద్దంకి దయాకర్ వెంకటరెడ్డిని అమానించారు.
ఆ తర్వాత క్షమాపణలు కోరినా బ్రదర్స్ మాత్రం రేవంతే ఇదంతా చేయిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లొచ్చిన రాజగోపాల్ రెడ్డి జైలుకెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన పనిచేసే కాంగ్రెస్‌లో తాను ఉండలేనని, అతనొక చిల్లర నేతగా కూడా అభివర్ణించారు.దీనిపై రేవంత్ స్పందిస్తూ దేశంలో చాలా మంది జైలుకెళ్లి రాజకీయాల్లోకి వచ్చారని, గాంధీ కూడా జైలు జీవితం గడిపారని.ఆ మాటకు వస్తే బీజేపీ పార్టీ టాప్ లీడర్.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జైలుకెళ్ళి వచ్చారు కదా అని రేవంత్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.తాను కేవలం 30 రోజులు జైల్లో ఉంటే హత్యారోపణల కింద అమిత్ షా ఏకంగా 90 రోజులు జైల్లో ఉన్నారని గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జైలు జీవితాల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు.