తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలవనున్న నాయకులు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలపనున్నారు.
ఈ క్రమంలోనే 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ నేతలు అందించనున్నారు.కాగా మొన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.







