తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ కు రానున్నారు.ఈనెల 23న నగరానికి చేరుకోనున్న ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం.
ముందుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు.24న అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు.25న కార్పొరేటర్లు, మాజీ నేతలతో మీటింగ్, 26న ఖమ్మంలో రేణుకా చౌదరి నిర్వహించనున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.