లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఫోకస్ పెట్టింది.ఎంపీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్( KC Venugopal ) తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యమైన నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని సమాచారం.అయితే మంత్రి వర్గ విస్తరణ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.