PM Narendra Modi Telangana Tour: బీజేపీ vs టీఆర్ఎస్.. తెలంగాణలో మోడీ పర్యటన ప్రకంపనలు!

నవంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ పర్యటనను రానున్న విషయం తెలిపిందే.ఇటీవల పునరు ప్రారంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

 Telangana Cm Kcr May Again Skip Welcoming Pm Narendra Modi-TeluguStop.com

అయితే ఈ పర్యటనపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నడుస్తుంది.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరుసగా నాలుగోసారి మోడీ పర్యటనను స్కిప్ చేయవచ్చని తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వానం పంపలేదని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఆరోస్తుండగా.

ప్రధానమంత్రి కార్యాలయం నుండి కేపీఆర్‌కు ఆహ్వానం అందినట్లుగా బీజీపీ అంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ రాష్ట్ర మంత్రిని నియమించే అవకాశం ఉంది.

తెలంగాణకు మోదీ 10 నెలలో నాలుగో సార్లు వస్తే ఒక్కసారి కూడా ఆయనను కేసీఆర్ కలవలేదు.కేసీఆర్.

మోడీకి స్వాగతం పలకపోవడంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది.ఇప్పుడు రామగుండంలో ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని పిఎంవో సరైన రీతిలో ఆహ్వానించడం లేదంటూ టీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది.

ప్లాంట్‌లో తెలంగాణకు 11 శాతం వాటా ఉన్నప్పటికి ముఖ్యమంత్రికి అధికారికంగా ఆహ్వానం పంపకపోవడం పట్ల పీఎంవో అగౌరవంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Kishan Reddy, Pmnarendra, Trs, Trs Bjp-Political

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించడమే కాకుండా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రికి సందేశం పంపలేదని పలువురు నాయకులు విమర్శించారు.ప్లాంట్‌ పని చేయడం ఏడాదికి పైగా అయినప్పటికీ ప్రధాని ఇప్పుడు వచ్చి ప్రారంభించడం ఏంటని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.మునుగోడు ఉపఎన్నికలో ఓటమి నుండి అలాగే నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు సంబంధించి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని చూస్తుందని టిఆర్ఎస్ పేర్కొంది.

రామగుండం పర్యటన సందర్భంగా మోదీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube