ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా లిక్కర్ మాఫియాకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరులా మారిపోయిందని తెలంగాణ బిజెపి ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతపురం కు వచ్చినాయన బిజెపి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనతి కాలంలోనే సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారమై తప్పుబట్టారు.
పేదల సంంతింటి కల సాకారం చేయాలని ఇళ్ల నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వం నిదులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగనన్న ఇల్లు పేరిట గొప్పలు చెప్పుకుంటూ ఉందని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వైసిపి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ప్రజాసంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరిట సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నడవడం కొత్తవి కాదని గతంలోనూ కలిసి పోటీ చేశారని కేంద్రంలో అధికారాన్ని కూడా పంచుకున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ఈటెల రాజేందర్ ను మచ్చిక చేస్తున్నట్లు బిఆర్ఎస్ పెద్దలు నటిస్తున్నారని చెప్పారు.ఈటల రాజేందర్ వ్యక్తిత్వం గల మనిషి అన్నారు.

తెలంగాణ ప్రజలు ఆకలితో పస్తులైన ఉంటారు కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరన్న విషయం కల్వకుంట్ల కుటుంబానికి తెలిసి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.అనంతరం బిజెపి ఏపీ అధికార ప్రతినిధి లంక దినకర్ మాట్లాడుతూ నిన్న మొన్నటిదాకా మూడు రాజధాని చెప్పిన వైసీపీ ప్రభుత్వం నేడు విశాఖ రాజధాని అంటూ మరొక్కసారి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందన్నారు.కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించకపోగా ఉన్నచోటే హైకోర్టు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసే ప్రక్రియ ను రాష్ట్ర ప్రభుత్వం ఆవలంబిస్తోందన్నారు.