సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన సినిమాలలో చిన్న సినిమా అయినా హనుమాన్ మూవీ అత్యంత భారీ స్థాయిలో అంచనాలతో విడుదలైన సంగతి తెలిసిందే.తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి.తేజ సజ్జా సూపర్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
కథ :
సౌ రాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) బాల్యం నుంచి సూపర్ హీరో కావాలని కలలు కనడంతో పాటు ఆ కలకు అడ్డొచ్చిన తల్లీదండ్రులను చంపేస్తాడు.భూ ప్రపంచంలో తనకు తప్ప ఎవరికీ సూపర్ పవర్స్ ఉండకూడదని భావించి అందుకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు.అయితే ఆ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో అసలైన సూపర్ పవర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.
మరోవైపు అంజనాద్రి అనే అడవి ప్రాంతంలో హనుమంతు(తేజ సజ్జా), అక్క అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్) తో కలిసి నివాసం ఉంటాడు.హనుమంతు చిన్నప్పటి నుంచి మీనాక్షి(అమృతా అయ్యర్) ను ఎంతో ప్రేమిస్తుంటాడు.
మీనాక్షి ఒకరోజు అంజనాద్రిలోని పాలెగాడు గజపతి(దీపక్ శెట్టి) ని ఎదురిస్తుంది.ఆమె అలా చేయడం నచ్చని గజపతి మీనాక్షిపై బందిపోట్లతో దాడి చేయించగా ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన హనుమంతు తీవ్ర గాయాలపాలవుతాడు.
బంధిపోటు ముఠా హనుమంతును నీళ్లలో పడేయగా అతనికి రుధిర మణి దొరుకుతుంది.
రుధిర మణి ద్వారా సూపర్ పవర్స్ పొందిన హనుమంతు హనుమ్యాన్ గా మారి ఏం చేశాడు? హనుమంతు శక్తుల గురించి తెలిసి రుధిర మణి కోసం మైఖేల్ ఏం చేశాడు? హనుమంతుకి సహాయం చేస్తున్న విభీషణుడు(సముద్రఖని) ఎవరు? హనుమంతు మీనాక్షి ప్రేమ సఫలమైందా అనే ప్రశ్నలకు జవాబే ఈ హనుమాన్.
నటీనటుల పనితీరు :
తేజ సజ్జా నటుడిగా ఈ సినిమాతో మరో పది మెట్లు పైకి ఎదిగాడనే చెప్పాలి.సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
కథానుసారం వచ్చే ట్విస్టులు బాగున్నాయి.సంక్రాంతికి ఫ్యామిలీతో సహా మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.
సినిమా మొదటి 20 నిమిషాలు బోరింగ్ గా సాగినా చివరి 20 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంది.
సాంకేతిక వర్గం పనితీరు :
హనుమాన్ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేయగా ముగ్గురు సంగీత దర్శకులు పూర్తి న్యాయం చేశారు.దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలిచింది.నిర్మాత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదు.
ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ల రేసులో చేరినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా హిట్టవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్లస్ పాయింట్లు :
తేజ సజ్జా నటన
బీజీఎం, విజువల్ ఎఫెక్ట్స్
కథ
ప్రశాంత్ వర్మ డైరెక్షన్
మైనస్ పాయింట్లు :
కథనం నిదానంగా సాగడం