టెక్నాలజీ: గూగుల్ వినియోగిస్తున్నారా.. మీకు ఈ ట్రిక్స్ తెలుసా...?

చేతిలో ఫోన్ ఉన్నా లేదా ల్యాప్ లో వర్క్ చేస్తున్నా.ప్రస్తుత కాలంలో గూగుల్ క్రోమ్ తప్పని సరిగా వాడుతుంటాం.

 Technology: Using Google.. Do You Know These Tricks. Googel,tips, Technology New-TeluguStop.com

అయితే మన పని చేసుకుని క్లోజ్ చేస్తుంటాం.అందులో ఉండే ఫీచర్స్ ను పట్టించుకోం.

అలాంటి ఫీచర్స్ గూగుల్ క్రోమ్ లో ఉన్నాయని కూడా మనకి తెలియదు.అది తెలిసినప్పుడు అవాక్క్ అవుతాం.

కంప్యూటర్ అనుభవం ఉండి ఇలాంటి చిన్నచిన్నవి తెలియకపోతే ఒక్కోసారి మన పరువుపోయే అవకాశం ఉంది.ఎవరైనా వాటి గురించి అడిగితే చెప్పలేకపోతే మన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

కాబట్టి ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బంద్ అయ్యాక.

అనేక మంది క్రోమ్ వైపే మొగ్గుచూపుతున్నారు.దీంతో అనేక ఫీచర్స్, షార్ట్కట్స్ తో.గూగుల్ క్రోమ్ ఎంతో అనువుగా అంతర్జాలంలో దూసుకుపోతుంది.వాటిల్లో కొన్ని ఫీచర్స్ మీకోసం.

అందులో ఒకటి… లింక్డ్ డివైజ్ల మధ్య URL షేరింగ్ ఎలానో తెలుసుకుందాం.ఒకటి కన్నా ఎక్కువ డివైజ్లు వాడుతున్నప్పుడు చాలా వరకు ఒకటే గూగుల్ అకౌంట్ లాగిన్ అయి ఉంటాం.

అలాంటప్పుడు వేర్వేరు డివైజ్ల మధ్య మనం యూఆర్ఎల్స్ షేర్ చేసుకోవచ్చు ఎలా అంటే…? ఒక్కోసారి మనకో వెబ్సైట్ కనిపించింది.కానీ దానిని తర్వాత తీరికగా స్మార్ట్ ఫోన్ లో ఓపెన్ చూసి చూడాలని అనుకుంటాం.

అప్పుడు క్రోమ్ బ్రౌజర్లోని ‘సెండ్ టు యువర్ డివైజ్‘ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ లింక్ మీ స్మార్ట్ ఫోన్ లోని బ్రౌజర్ కు వెళ్తుంది.ఆ వెబ్ సైట్ ను మనకు కావాల్సినప్పుడు ఫోన్లో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు.

ఇంకోకటి.ఏదైనా ఒక ముఖ్యమైన వెబ్సైట్ గురించి మర్చిపోకూడదు అనుకుంటే పిన్.

అన్ పిన్.అనే ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్లో ఎడమవైపు పిన్ చేసుకోవచ్చు.

అది అవసరం లేదనుకుంటే ఆ సైట్ ను అన్ పిన్ చేసుకోవచ్చు.ప్రస్తుత రోజుల్లో సమయం ఎతం విలువైనదో అందరికి తెలిసిందే.

అయితే ఏదైనా జాబ్ లేదా ఈవెంట్ కోసం రిజిస్టర్ చేసుకునే సమయంలో మన పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, చిరునామా ఇలాంటి వివరాలన్నీ ప్రతిసారీ మాన్యువల్ గా ఎంటర్ చేస్తూ ఉంటాం.

Telugu Googel, Ups, Tips-Latest News - Telugu

అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఆటో ఫిల్ ఆప్షన్ తో ఇక ఆ పని ఉండదు.ఒక్కసారి ఆటోఫిల్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే… అవసరమైనప్పుడు బ్రౌజర్ ఆటోమెటిక్ గా దరఖాస్తు నింపేస్తుంది.ఇక గూగుల్ లెన్స్ మాయాజాలం చూసేద్దాం.

ఆన్ లైన్ లో అనేక వస్తువులు చూస్తుంటాం కాని వాటిని ఎలా వెతకాలో మనకు తెలియదు.అలాంటప్పుడు గూగుల్ లెన్స్ ఎంతగానే ఉపయోగపడుతుంది.

దానికోసం గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్లో లెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి.ఆ వస్తువును ఫొటో తీస్తే చాలు సంబంధిత వివరాలన్నీ మన ముందు ప్రత్యక్షమవుతాయి.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ అంటే ఏంటో తెలుసా.ఇది కూడా పైన చెప్పిన ఫీచర్ లాంటిదే.

కాని ఇది మన దగ్గర ఉన్న ఫొటోకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.క్రోమ్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ కు వెళ్లి.

మర దగ్గర ఉన్న ఇమేజ్ ను అప్లోడ్ చేయాలి.వెంటనే ఆ ఫొటోకు సంబంధించిన వెబ్సైట్స్ వస్తాయి.

అయితే ఇలాంటి కొన్ని ఫీచర్స్ ను మీరు స్వయంగా వెతికి తెలసుకునేందుకు ప్రయత్నం చేయండి.దీంతో మీరు ఈజీగా వాటిని గుర్తు పెట్టుకుంటారు.

వాటిల్లో రీస్టార్ట్‌ క్రోమ్‌, కస్టమ్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ఫైల్‌ ఎక్స్‌ఫ్లోజర్‌ ఫర్‌ విండోస్‌, థర్డ్‌ పార్టీ కుకీస్‌ ఇలాంటి ఫీచర్స్ గూగుల్ క్రోమ్ లో ఎన్నో ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని వాటితో ఒక ఆట ఆడుకోండి ఇక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube