టెక్నాలజీ: ఈ మాస్క్ గాలిలోనే కరోనాని ఖతం చేస్తుందట...?!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కరోనా ఉధృతి పెరిగి గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీ వారు వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ప్రజలకు శుభవార్త తెలియజేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రానికి చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేశారు.

వాస్తవానికి ఈ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ ను చూడడానికి గోడకు తగిలించే ఒక పెద్ద సిసి కెమెరా లాగా ఉంటుంది.కానీ దీని పనితీరు మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది.

గాలిలో చక్కర్లు కొడుతున్న కరోనా వైరస్ ను  చంపుతుందని  కంపెనీ వారు పేర్కొంటున్నారు.ఇందులో అయాన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు, అలాగే ఈ టెక్నాలజీ ఉపయోగించడం  మన దేశంలోనే ఇదే మొదటిసారి అని వారు పేర్కొంటున్నారు ఈ పరికరాన్ని తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (Rajiv Gandhi Centre for Biotechnology (RGCB) వారు టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Technology This Mask Cuts The Corona In The Air Rgcb, Ksum, Wolf Air Mask,caro

ఇక ఈ పరికరం పని విషయానికి వస్తే  తనకు తానుగా స్టెరిలైజ్ చేసుకుంటుంది.అంతేకాకుండా దాని చుట్టూ ఉన్న 1000 చదరపు అడుగులలో ఉన్న వైరస్ ను కేవలం 5 నిమిషాల్లోనే చంపుతుంది ఈ పరికరం కంటిన్యూగా 60 వేల గంటలపాటు పని చేస్తున్నట్లు  కంపెనీ వారు తెలియజేస్తున్నారు.ఇక ఈ పరికరాన్ని ఆస్పత్రిలో, ల్యాబ్లో, ఆఫీసులో థియేటర్లు లో సెట్ చేసుకోవచ్చని అని కంపెనీ వారు పేర్కొంటున్నారు.

Advertisement
Technology This Mask Cuts The Corona In The Air RGCB, KSUM, Wolf Air Mask,caro

ఇది  కేవలం కరోనాని మాత్రమే కాకుండా రోగాలు తెప్పించే బ్యాక్టీరియాను కూడా చంపేసిందని కంపెనీ వారు పేర్కొంటున్నారు ఇలాంటి పరికరం సినిమా హాల్లో ఉంటే ఇక రోజంతా నాలుగు షోలు కూడా వేసుకోవచ్చని తెలిపారు.ఇక ఈ వస్తువు  ధర విషయానికి వస్తే ఇండియామార్ట్ లో రూ.29,500గా నిర్ణయించారు.ఎవరైనా కొనాలనుకునేవారు  కొనుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు