ప్రస్తుతం రైతులు( Farmers ) ఒకే రకం పంటలు కాకుండా వివిధ రకాల పంటలు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.ఉద్యానవన తోటలలో అయితే మంచి లాభాలు వస్తాయని ద్రాక్ష, మామిడి, దానిమ్మ, బత్తాయి లాంటి తోటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ద్రాక్ష పంట సాగులో ( Grape Cultivation )అధిక దిగుబడి పొందాలంటే కొన్ని కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.ద్రాక్ష సాగులో కోమ్మ కత్తిరింపులు చాలా కీలకం.
మల్లెలలో ఎలాగైతే కొమ్మలను కత్తిరిస్తారో. ద్రాక్షలలో కూడా అలాగే కొమ్మ కత్తిరింపులు చేస్తే త్వరగా కాపుకు రావడంతో పాటు మంచి దిగుబడి పొందవచ్చు.
రైతులు ద్రాక్ష మొక్క తీగను సరిగా ప్రాకించకపోయినా లేదా కత్తిరించకపోయినా పంట దిగుబడి అనుకున్న రీతిలో రాదు.

ద్రాక్ష తోటలలో సంవత్సరానికి రెండుసార్లు కొమ్మ కత్తిరింపులు చేయాలి.మొదట వేసవి కాలంలో కొమ్మ కత్తిరింపులు చేయాలి.వేసవిలో కొమ్మలు కత్తిరించడం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి.
శీతాకాలంలో రెండవసారి కొమ్మ కత్తిరింపులు చేయాలి.ద్రాక్ష గుత్తుల పరిమాణం సైజు పెరగాలంటే.
జిబ్బరిల్లిక్ యాసిడ్ ( Gibberellic acid )అను హార్మోన్ ను రెండుసార్లు పిచికారి చేయాలి.ఈ ద్రాక్ష మొక్కలను పెంచడం ఎంత సులువో కత్తిరింపు విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ద్రాక్ష పంట కోతకు వచ్చిందని తెలియాలంటే.ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా, తియ్యగా ఉంటే కోతకు వచ్చినట్లు గుర్తించు కోవాలి.తెల్ల ద్రాక్ష పంటను ( Grape Cultivation )సాగు చేస్తే బాగా తయారైనప్పుడు అంబర్ రంగులోకి మారుతుంది.రంగు ద్రాక్ష లాగా రంగు వచ్చి పైన బూడిద వంటి పొడి తో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది.
అప్పుడు పండ్లు కోతకు సిద్ధం అని అర్థం చేసుకోవాలి.ఒక ఎకరాకు 10 టన్నుల దిగుబడి పొందవచ్చు.