సాధారణంగా రైతులు( Farmers ) అధిక దిగుబడులు వచ్చి మంచి లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తారని అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో ఉండే రైతులు విదేశీ పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ, సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక దిగుబడులు సాధించడంలో విఫలం అవుతున్నారు.
ఈ క్రమంలో ఇండోనేషియా, సింగపూర్ దేశాలకే పరిమితమైన చెకుర్మనీస్( Chekurmanis Plant ) ను భారతదేశంలో సాగు అవుతూ, ప్రతి ఏడాది ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ పోతోంది.ఈ పంటను ఎలా సాగు చేసే విధానం గురించి తెలుసుకుందాం.ఈ చెకుర్మనీస్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడి( High yield ) ఇస్తుంది.
అనేక ఔషధాల తయారీలో చెకుర్మనీస్ ను ఉపయోగిస్తారు.వివిధ రకాల కంటి సమస్యలు, జ్వరం లాంటిది తగ్గడానికి చెకుర్మనీస్ ను ఎక్కువగా వాడుతారు.
ఈ మొక్క అన్ని రకాల నేలలలో ఆరోగ్యంగా పెరుగలుగుతుంది.కొంతవరకు నీడ ఉంటే కూడా ఈ మొక్కలు తట్టుకొని పెరుగలుగుతాయి.
వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకొని, మిగతా పంటలు విశేషాలు ఏవైనా ఉంటే పూర్తిగా శుభ్రం చేసి నేలను చదును చేసుకోవాలి.నర్సరీలలో ఈ మొక్క ధర రూ.25 ఉంటుంది.పొలంలో మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
ఒక మొక్క నుంచి సంవత్సరానికి మూడు కిలోల ఆకుల దిగుబడి పొందవచ్చు.ఒక హెక్టార్ లో 30 టన్నుల ఆకుల దిగుబడి పొందవచ్చు.ఈ ఆకులను పశువుల మేతగా, కోళ్లకు మేతగా వాడుకోవచ్చు.