మిరప పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు.. వేరు పురుగుల నివారణకు చర్యలు..!

మిరప పంట( Chilli crop ) సాగుపై పూర్తి అవగాహన ఉంటే, యాజమాన్య పద్ధతులలో మెళుకువలు తెలిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

మిరప పంట సాగు నల్ల రేగడి నే, ఎర్ర నేలలు( Black ,red soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.

మిరప పంటకు అందించాల్సిన పోషక ఎరువుల విషయానికి వస్తే.అనవసర రసాయన ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా పచ్చిరొట్ట పైర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

మిరప సాగు చేసే పంటలో ముందుగా మినుము పంటను వేసి పొలాన్ని కలియదున్నాలి.దీంతో భూమికి కావలసిన సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఆ తర్వాత నేల మెత్తగా, వదులుగా అయ్యేవరకు రెండు లేదా మూడుసార్లు ట్రాక్టర్ కల్టివేటర్ తో దున్నుకోవాలి.

Techniques In Management Of Nutrient Fertilizers In Chili Crop, Measures To Prev
Advertisement
Techniques In Management Of Nutrient Fertilizers In Chili Crop, Measures To Prev

ప్రధాన పొలంలో నాటేందుకు తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ఎంపిక చేసుకోవాలి.నారు నాటిన 20 రోజుల తర్వాత 50 కిలోల పొటాష్( Potash ), 20 కిలోల బాస్వరం, 100 కిలోల నత్రజని ఎరువులు(Nitrogen fertilizers ) అందించాలి.ఇక వర్షాలు అధికంగా ఉంటే మొక్కలు నేల నుంచి పోషకాలను సక్రమంగా గ్రహించలేవు.

కాబట్టి ఒక లీటరు నీటిలో 19:19:19 ఎరువును 8గ్రాములు కలిపి మొక్కలపై పైపాటుగా పిచికారి చేయాలి.మిరప పంటకు వివిధ రకాల తెగుళ్లు లేదంటే చీడపీడలు ఆశించకుండా ఉండాలంటే, ఒకవేళ ఆశిస్తే వ్యాప్తి తక్కువగా ఉండాలంటే నీటిని డ్రిప్ విధానం ద్వారా అందిస్తూ, ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించాలి.

దీంతో కలుపు సమస్య దాదాపుగా లేనట్టే.

Techniques In Management Of Nutrient Fertilizers In Chili Crop, Measures To Prev

మిరప పంటకు వేరు పురుగులు ఆశించకుండా ఉండాలంటే ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 12 కిలోల కార్బోఫ్యురాన్ 3g గుళికలు వేసుకోవాలి.పంటకు ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే, పంటకు ఇది ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేస్తేనే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకొని పాటించాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు